ఎఫ్. సి. ఎన్ సేవలు అద్భుతం : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

స్థానిక షాద్నగర్ పట్టణం కేంద్రంగా నడపబడుతున్న ఎఫ్. సి.ఎన్. హోమ్ నందు గురువారం ఫిబ్రవరి 22న చుట్టుపక్కల 20 గ్రామాల నుండి వచ్చిన 400 మంది వృద్ధులకు ఎఫ్.సి. ఎన్. వ్యవస్థాపకులైన డాక్టర్ గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు సుమారు 1500 రూపాయల విలువైన దుస్తులు

Update: 2024-02-23 09:38 GMT

స్థానిక షాద్నగర్ పట్టణం కేంద్రంగా నడపబడుతున్న ఎఫ్. సి.ఎన్. హోమ్ నందు గురువారం ఫిబ్రవరి 22న చుట్టుపక్కల 20 గ్రామాల నుండి వచ్చిన 400 మంది వృద్ధులకు ఎఫ్.సి. ఎన్. వ్యవస్థాపకులైన డాక్టర్ గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు సుమారు 1500 రూపాయల విలువైన దుస్తులు, దుప్పటి, టవల్, గొడుగు, స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు.



ఈ కార్యక్రమానికి షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ హాజరై డాక్టర్. గీత,తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు ఈ ప్రాంతంలో పేదలకు చేసే సహాయాన్ని కొనియాడుతూ ఎఫ్. సి. ఎన్. సేవలు అద్భుతం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో తన వంతు సహాయంగా వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 400 మందికి రెండు లక్షల రూపాయల చెక్కును సంస్థకు అందజేయడం జరిగింది.




 ఎఫ్. సి. ఎన్. వ్యవస్థాపకులు డాక్టర్.గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు మాట్లాడుతూ కుల మత రాజకీయాల కు అతీతంగా సేవలందిస్తున్నామన్నారు. వారికి బహుమతిని అందజేసినప్పుడు ఆ చిరునవ్వులో కనపడే ఆనందం మాకు సంతృప్తిని ఇస్తుందన్నారు.

Tags:    

Similar News