తెలంగాణలో కులగణనకు కసరత్తు
తెలంగాణలో కులగణన విధివిధానాలపై కసరత్తు ప్రారంభమయింది.
ponnam prabhakar
తెలంగాణలో కులగణన విధివిధానాలపై కసరత్తు ప్రారంభమయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులతో సమావేశమై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. కులగణనకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆయన ఈ చర్చ జరిపారు.
రాష్ట్రాల్లో అధ్యయనం...
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కులగణనకు అనుసరించిన విధానంపై అధ్యయనం చేసి అందులో ఏది పారదర్శకంగా ఉంటుందో దానిని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించినట్లు తెలిసింది. అయితే వీలయినంత త్వరగా కులగణను తెలంగణలో ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.