KCR : వారిపైన కూడా సుప్రీంకోర్టుకు... కేసీఆర్ కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.

Update: 2025-08-01 02:04 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే గత ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాన్ని మూడు నెలల్లోగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

బనకచర్ల ప్రాజెక్టుపై...
దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న వారు కాంగ్రెస్ లోకి మారిన వారిపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించారు. పార్టీ నేతలకు ఈ మేరకు సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు గోదావరి - బనకచర్ల ఎత్తిపోతల పథకంపైన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు.దీనిపై న్యాయవాదులతో మాట్లాడి సిద్ధంగా ఉండాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.


Tags:    

Similar News