రేవంత్ గత చరిత్ర మర్చిపోయినట్లున్నారు

ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా గత ప్రవర్తన మరచిపోలేదని రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2022-08-03 07:01 GMT

ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా గత ప్రవర్తన మరచిపోలేదని రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలోకి మారిన రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో మాట్లాడుతున్నట్లు కన్పిస్తుందన్నారు. దేశంలో అంతరించి పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. పిచ్చి భాష మాట్లాడితే ప్రజలు ఊరుకోరని ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగారని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని ఈటల తెలిపారు. ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసునని అన్నారు.

మంత్రి పదవి ఇస్తామన్నా రాలేదు....
దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోతుందనడానికి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కూడా తాము టీఆర్ఎస్ లోకి రమ్మని అడిగినా ఆయన రాలేదన్నారు. 2014లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడించాలని చూసినా వల్ల కాదన్నారు. టీఆర్ఎస్ అనేక సార్లు రమ్మని అడిగినా కోమటిరెడ్డి రాలేదన్నారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పినా కాంగ్రెస్ కు రాలేదన్నారు. 2014 నుంచి 2022 వరకూ ఆయనను ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా భరించాడన్నారు. అంతరించిపోతున్న కాంగ్రెస్ లో ఉండాలని ఎవరనుకుంటారని ప్రశ్నించారు.


Tags:    

Similar News