సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

Update: 2025-04-22 02:44 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సినీహీరో మహేశ్ బాబు ఇటీవల ఈడీ దాడులు జరిపిన సాయిసూర్య డెవలెపర్స్, సురానా గ్రూప్స్ కు సంబంధించిన యాడ్స్ లో ఆయన పాల్గొన్నారు. అందుకు ఆయన దాదాపు ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది.

నగదు లావాదేవీలపై...
అయితే ఈ ఆరు కోట్లలో మూడున్నర కోట్ల రూపాయల నగదు, మిగిలిన మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసింది. అయితే దీనికి సంబంధించిన వివరాలను అడిగేందుకే మహేశ్ బాబును ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. సురానా గ్రూపు, సాయి సూర్య డెవలెపర్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News