బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

భూదాన్ భూముల స్కాంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల నోటీసులు జారీ చేశారు.

Update: 2024-12-13 02:54 GMT

భూదాన్ భూముల స్కాంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల నోటీసులు జారీ చేశారు. ప్రముఖ బిల్డర్స్ కి కూడా నోటీసులు వెళ్లాయి.ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. వీరితో పాటు మరికొందరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

భూదాన్ భూముల స్కాంలో...
ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఐఏఎస్ అధికారి అమోస్ కుమార్ ను విచారించిన నేపథ్యంలో వీరిని విచారించడానికి ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. పెద్దయెత్తున భూదాన్ భూముల్లో అవినీతి జరిగిందని, పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News