Kavitha : కవిత ఇంట్లో ఈడీ సోదాలు అందుకేనా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-03-15 11:12 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు నేరుగా ఆమె నివాసానికి వెళ్లి అక్కడి నుంచి ఆమె వ్యక్తిగత సిబ్బందిని, సెక్యూరిటీని పంపించి వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కవిత నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. కవితకు సంబంధించిన రెండు ఫోన్లను అధికారుల సీజ్ చేశారు.

ఎన్నికల వేళ...
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళ అధికారులతో సహా మొత్తం ఎనిమిది మంది అధికారుల బృందం ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. కవిత నివాసంలో ఉన్న అందరి వద్ద నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాల సమాచారాన్ని బయటకు పోనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.



Tags:    

Similar News