Kalavakuntla Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది

Update: 2024-03-26 02:11 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈ నెల 15వ తేదీన బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు వారం రోజులు ఈడీ అధికారులకు కస్టడీకి ఇచ్చింది. తర్వాత ఈడీ తరుపున న్యాయవాదుల అభ్యర్థన మేరకు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది. ఈరోజుతో కవిత కస్టడీ ముగియనుంది.

బెయిల్ పిటీషన్ పై...
మరోమారు కస్టడీని పొడిగించాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరే అవకాశముంది. విచారణకు సహకరించకపోవడం వల్ల కస్టడీని పొడిగించాలని కోరనున్నారు. ఇదే కేసులో అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి విచారించడానికి తమకు కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించనున్నారు. అయితే ఇదే సమయంలో కవిత తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు. దీనిపై కూడా నేడు విచారణ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News