Telangana : జులై 1వ తేదీన బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నెల ఒకటోతేదీన జరగనుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నెల ఒకటోతేదీన జరగనుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త నేత ఎంపికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకోసం ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఎన్నిక నిర్వహించనుండటంతో కొత్త అధ్యక్షడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
సోమవారం నుంచి...
సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఈ నెల 29వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తుండటంతో నూతన అధ్యక్షుడి నియామకంపై చర్చ జరిగే అవకాశముందని తెలిసింది. అయితే ఇప్పటికే అధ్యక్షుడి పేరు ఖరారయిందని, ఎన్నిక నామమాత్రమేనని చెబుతున్నారు. అయితే నామినేషన్లను పరిశీలించిన తర్వాత వచ్చే నెల ఒకటో తేదీన బీజీపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికను నిర్వహిస్తారు.