ఎనిమిది మంది కార్మికులు ఇంకా లోపలే

శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకుపోయి ఉన్నారు

Update: 2025-02-23 03:38 GMT

శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. నిన్నటి నుంచి సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు టన్నెల్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు ఇంత వరకూ ఫలించలేదు.

కార్మికుల కుటుంబాల్లో...
దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తుంది. టన్నెల్ లో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తీసుకు వచ్చేందుకు వెళ్లిన సిబ్బందికి మోకాళ్ల లోతు బురద ఉండటంతో అక్కడకు వెళ్లలేక రాత్రి తిరిగి వచ్చారు. బృందాలుగా విడిపోయి మరోసారి టన్నెల్ లోకి వెళ్లారు. చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఎలా ఉందన్న ఆందోళన నెలకొంది.


Tags:    

Similar News