హనుమకొండలో ఐఫిల్ టవర్

ఫ్రాన్స్ లో ప్రముఖ కట్టడమైన ఐఫిల్ టవర్ 135 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Update: 2025-08-22 11:53 GMT

ఫ్రాన్స్ లో ప్రముఖ కట్టడమైన ఐఫిల్ టవర్ 135 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఐఫిల్ టవర్ ను అనుకరిస్తూ 30 అడుగుల ఎత్తుతో నమూనా ఐఫిల్ టవర్ను నిర్మించింది. హనుమకొండ నగరంలోని బాలసముద్రం కూడలిలో అమృత్ పథకంలో భాగంగా 19 లక్షల వ్యయంతో దీన్ని తీర్చిదిద్దారు. విద్యుత్తు దీపాల అలంకరణతో రాత్రి సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోతూ నగరవాసులకు కనువిందు చేస్తోంది. వారాంతంలో జనం సందడి పెరిగి పర్యాటక ప్రదేశంగా మారుతోంది.

Tags:    

Similar News