Breaking : తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణలో డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది

Update: 2023-10-13 12:14 GMT

తెలంగాణలో డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 30వ తేదీన తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో డీఎస్సీ నియామక పరీక్షను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.

వచ్చే నెలలో...
వాస్తవానికి ఈ పరీక్షలు నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకూ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. డీఎస్సీ పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు గత కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశలు పెంచుకున్నారు. అయితే ఎన్నికల దృష్ట్యా వాయిదా పడటంతో నిరుద్యోగ అభ్యర్థులంతా ఒక్కసారి నిరాశకు గురయ్యారు. ఈ పరీక్షలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగే అవకాశముంది.


Tags:    

Similar News