Telangana : ఈ పరీక్షకు కూడా నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.. జాగ్రత్త మరి
తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు మే 2వ తేదీ నుంచి నాల్గో తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎప్ సెట్ పరీక్షకు...
నేడు జరగబోయే ఎప్ సెట్ పరీక్షకు 3.60 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ కోసం 2.20 లక్షల దరఖాస్తులు అందాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ఒక సెషన్ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకూ మరో పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. హాజరయ్యే విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. ఫొటో ఐడీతో పాటు హాల్ టిక్కెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.