సినిమా స్టైల్ లో లారీని ఎగిరించేసిన డ్రైవర్

పుష్ప సినిమాలో లారీ ఎగిరే సీన్స్ మనం చూసే ఉంటాం.

Update: 2025-06-17 13:15 GMT

lorry

పుష్ప సినిమాలో లారీ ఎగిరే సీన్స్ మనం చూసే ఉంటాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మేళ్లచెరువులోని ఓ సిమెంటు కంపెనీలో ఆదివారం రాత్రి లారీ బస్తాలు లోడు చేసుకుని బయలుదేరింది. మేళ్లచెరువు-కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలోని కొత్త వంతెన ప్రదేశంలో ఉన్న డైవర్షన్‌ రోడ్డును డ్రైవరు గమనించలేదు.


రోడ్డుపై మట్టి కుప్పల్ని దాటుకుంటూ వచ్చేయగా.. మధ్యలో ఎగువ నుంచి వచ్చే వాగు నీటిని మళ్లించేందుకు వంతెన నిర్మిత ప్రదేశానికి కొంచెం వెనకగా రోడ్డు తవ్వి కాల్వ చేశారు. ఇది 10 అడుగులకు పైగా వెడల్పు, 25 అడుగులు లోతు ఉంది. దీన్ని ఆఖర్లో గమనించిన డ్రైవరు లారీని నియంత్రించలేక అలాగే పోనిచ్చాడు. అయితే అతడి అదృష్టం బాగుంది. వాహనం పెద్ద కాల్వను సెకన్ల వ్యవధిలో దాటేసింది. టైర్ల బేస్‌లు, కమాన్‌ కట్టలు, డీజిల్‌ ట్యాంకు మాత్రం దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

Tags:    

Similar News