ప్రాణాలు తీశాయ్ డీజే సౌండ్స్

డీజే సౌండ్‌ బాక్సుల మోత మహిళల ప్రాణాలు తీసింది.

Update: 2025-10-06 13:08 GMT

డీజే సౌండ్‌ బాక్సుల మోత మహిళల ప్రాణాలు తీసింది. సాంప్రదాయ బద్ధంగా జరగాల్సిన పలు కార్యక్రమాలను డీజే సౌండ్స్ తో నింపేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో డీజే సౌండ్‌ బాక్సుల మోత మధ్య బతుకమ్మ ఆడుతూ ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్‌లోని బంగల్‌పేట్‌ కాలనీలో జరిగిన వేడుకల్లో డీజే సౌండ్‌తో బతుకమ్మ పాటలు పెట్టుకుని మహిళలు బతుకమ్మ ఆడారు. భాగ్యలక్ష్మి అనే 56 ఏళ్ల మహిళ బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది. భైంసా మండలం వానల్‌పాడ్‌ గ్రామంలో జరిగిన ఘటనలో ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న రుషిత అనే 22 ఏళ్ల నవవధువు ప్రాణాలు కోల్పోయింది. డీజే సౌండ్‌తో బతుకమ్మ పాటలు పెట్టుకుని బతుకమ్మ ఆడుతుండగా రుషిత అస్వస్థతకు గురైంది. ఆమెను భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స అందే లోపే రుషిత ప్రాణాలు విడిచింది.

Tags:    

Similar News