తెలంగాణలో పాకిస్థానీలను పంపించేస్తున్నాం

తెలంగాణలో 199 మంది పాకిస్తానీలు ఉన్నారని డీజీపీ తెలిపారు.

Update: 2025-04-27 02:52 GMT

తెలంగాణలో 199 మంది పాకిస్తానీలు ఉన్నారని డీజీపీ తెలిపారు. ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 32 మందికి మాత్రమే టర్మ్ వీసా ఉందన్న డీజీపీ జితేందర్ ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. పహాల్గాం దాడి ఘటనతో అప్రమత్తమయిన కేంద్ర ప్రభుత్వం పాకిస్థన్ కు చెందిన పౌరులు దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

అమిత్ షా సూచనలతో...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పాక్ వీసా లు ఉన్నవారిని గుర్తించి వారిని తిరిగి తమ దేశానికి పంపేయాలని సూచించారు. దీంతో తెలంగాణలో కూడా పాకిస్థాన్ కు చెందిన అనేక మందిని గుర్తించిన పోలీసులు వారిని తమ దేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి పాక్ కు వెళ్లమని చెబుతున్నారు.


Tags:    

Similar News