కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Update: 2025-05-22 05:28 GMT

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.ఆంజనేయ స్వామి మాలను ధరించిన భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి మాల విరమణ చేస్తున్నారు. కొందరు తలనీలాలను సమర్పించుకుంటున్నారు.

నిన్న రాత్రి నుంచే...
నిన్న రాత్రి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తుల రాక ప్రారంభమయింది. దీంతో అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మాలధారణతో వచ్చిన వారు వెంటనే స్వామి వారిని దర్శించుకునేందుకు తగిన సౌకర్యాలను, ఏర్పాట్లను చేశారు. క్యూ లైన్లలో ఇంకా భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.


Tags:    

Similar News