Telangana : ఎనిమిదో రోజుకు చేరుకున్న సరస్వతి పుష్కరాలు

తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు

Update: 2025-05-22 05:37 GMT

తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు. ఎనిమిదో రోజు పుష్కరాలకు ఉదయం నుంచి భక్తులు పుష్కరస్నానాలు చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్ష మంది వరకూ పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

అన్ని ఏర్పాట్లు చేసి...
సరస్వతి మాతకు పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు అక్కడే ఉండి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు రోడ్లపైనే ఉండి నియంత్రిస్తున్నారు.


Tags:    

Similar News