Telangana : ఆరో రోజు సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరో రోజు సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వరంలోని త్రివేణిసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నేడు మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. పుష్కర్ ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
వైద్య శిబిరాలను...
రోజుకొక స్వామీజీ వచ్చి ఘాట్ లలో స్నాన మాచరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఎనభై ఐదు వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులుతెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వైద్య సౌకర్యం వెంటనే అందించేందుకు అవసరమైన వైద్య శిబిరాలను కూడా పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.