Medaram : మేడారానికి పోటెత్తుతున్న భక్తులు...కట్టడి చేయలేకపోతున్న పోలీసులు

మేడారం జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు.

Update: 2024-02-22 03:58 GMT

మేడారం జాతరకు పెద్దయెత్తున భక్తులు తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు. ఈ నె 21 న ప్రారంభమయిన జాతర 24వ తేదీ వరకూ సాగనుంది. ఈ నాలుగురోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా పది వేల మందితో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు వీవీఐపీల రాకతో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి...
దక్షిణాది కుంభమేళాగా భావించే మేడారం జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మంచినీటి సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్నానాలు చేసేందుకు జంపన్న వాగులోకి నీటిని లక్కవరం నుంచి విడుదల చేశారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని తమ కోర్కెలు చెప్పుకుంటే నెరవేరతాయని భక్తుల నమ్మకం. బెల్లాన్ని సమర్పించి వనదేవతలను వేడుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మేడారం జనసంద్రంగా మారింది. పోలీసులు ఒక దశలో భక్తులను కట్టడి చేయలేకపోతున్నారు.


Tags:    

Similar News