Mallu Bhatti Vikramarka : కాంగ్రెస్ లో విభేదాలపై భట్టి ఏమన్నారంటే?
కాంగ్రెస్ ప్రభుత్వం టీం వర్క్ తో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం టీం వర్క్ తో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ పవర్ షేరింగ్ అంటూ తెలంగాణలో ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అందరం కలసి టీం వర్క్ తో పనిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేశామన్న మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లో సహజంగానే అభిప్రాయ భేదాలు ఉంటాయని, కానీ అవి పార్టీ గడప దాటి బయటకు రావని అన్నారు. తమ ప్రభుత్వం బాగానే ఉందని, ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.
అందరూ టీం వర్క్ గా...
ఏదైనా జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమేనని, ముఖ్యమంత్రి, మంత్రులందరం కలసి కట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలన్న ప్రయత్నంలోనే ఉన్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అసంతృప్తులు సహజమేనని, మంత్రి పదవులు దక్కని వారు కొంత అసహనంగా ఉంటారని, కానీ తర్వాత మెల్లగా అవన్నీ సర్దుకునేటివేనని మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, నిధుల కోసం చూడకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.