తెలంగాణ తలసరి ఆదాయం భట్టి కామెంట్స్ ఇవే

గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను లీడర్ గా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు

Update: 2025-02-14 07:43 GMT

గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను లీడర్ గా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణలో తలసరి ఆదాయం 3.56 లక్షలకు చేరిందన్న మల్లుభట్టి విక్రమార్క తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా వేగవంతం చేశామని తెలిపారు.

పూలసాగును ప్రోత్సహించాలని...
తెలంగాణ ప్రాంతంలో పూలసాగును మరింతగా నాబార్డు ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో వరి పండిందని తెలిపారు. రైతులందరూ హ్యాపీగా ఉన్నారన్న మల్లు భట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు.


Tags:    

Similar News