Mallu Bhatti Vikramarka : గద్దర్ అవార్డులు ఉగాది నుంచే

ఉగాది నుంచి గద్దర్ అవార్డులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు

Update: 2025-03-02 07:02 GMT

ఉగాది నుంచి గద్దర్ అవార్డులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గద్దర్ ఫిలిం అవార్డులను ఉగాది నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలం నంది అవార్డులను ఇవ్వలేదని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

గత ప్రభుత్వం...
గత ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను ఆదుకునేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఎన్నో అమలు చేస్తున్నామని తెలిపిన మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అవార్డులతో కళాకారులు మరింతగా తమ ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.


Tags:    

Similar News