Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి

తెలంగాణ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2025-01-25 08:27 GMT

తెలంగాణ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రేపు నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను ఎంపిక చేసిన లబ్దిదారులకు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేపు గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనునట్లు మల్లు భట్టి విక్రమార్క వివరించారు.

మండలంలో ఒక గ్రామాన్ని...
మండలానికి ఒక గ్రామాన్నియూనిట్ గా తీసుకుని ఆ గ్రామంలో లబ్దిదారులకు ఈ నాలుగు పథకాలను అందిస్తామని తెలిపారు. పథకాలు అందలేదని, లబ్దిదారులుగా ఎంపిక కాలేదని ఆందోళనచెందాల్సిన అవసరం లేదన్నారు. మార్చి నెల వరకూ ఈ నాలుగు పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు కూడా సమయం ఉంటుందన్న ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికీ నాలుగు సంక్షేమ పథకాలను అందచేస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.


Tags:    

Similar News