Danam Nagender : గడువు కావాలన్న దానం నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ ను మరికొంత గడువు కోరారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ జారీ చేసిన అనర్హత నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఇంకా కొంత గడువు కావాలని ఆయన లేఖ పంపించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఈ నోటీసులు వెళ్లాయి. దీంతో దానం నాగేందర్ తనకు మరికొంత గడువు కావాలని కోరారు.
గడువు సమీపిస్తుండటంతో...
ఇప్పటికే స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వారిలో ఎనిమిది మంది తమ వివరణలు ఇచ్చారు. ఆ సమాధానాలపై విచారణ పూర్తయింది. అయితే దానం నాగేందర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాత్రమే ఇంకా వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. సుప్రీంకోర్టు స్పీకర్ కు నాలుగు వారాలు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరూ తాజాగా అదనపు సమయం కోరి స్పీకర్‌ను కోరారు.