రేపు ఖమ్మంలో సీపీఐ భారీ బహిరంగ సభ

రేపు ఖమ్మంలో సీపీఐ భారీ బహిరంగ సభ జరగనుంది

Update: 2026-01-17 04:26 GMT

రేపు ఖమ్మంలో సీపీఐ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది సభకు హాజరవుతారని అంచనాగా ఉంది. సీపీఐ జాతీయ మహా సభల సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని సీపీఐ నేతలు నిర్ణయించారు. సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను నేతలు ప్రస్తావించే అవకాశముంది.

జాతీయ మహా సభలు...
బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌, సీపీఐ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలతో పాటు ఓట్ల సవరణ వంటి విషయాలను ఈ సభలో నేతలు ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఈ నెల 21 వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయి.


Tags:    

Similar News