బావర్చి బిరియానీలో బల్లి..
రాం నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. సగం తిన్న బిర్యానీ ప్లేట్లో చచ్చిపడి ఉన్న ఆ బల్లిని అలాగే వీడియో
హైదరాబాద్ లో మాంచి ఫేమస్ బిర్యానీ హోటల్ ఏమిటంటే బావర్చి అని అంటారు. అక్కడి బిరియానీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా బావర్చి బిరియానీలో బల్లి కనిపించడంతో కలకలం రేగింది. హైదరాబాద్ బిరియానీ లవర్స్ ను కలవరపెట్టే వార్తగా నిలిచింది. రాంనగర్ డివిజన్ కుంతులూరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ రవికుమార్ శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్ నుంచి ఇంటికి తెచ్చిన బిర్యానీలో బల్లి కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. దాదాపు సగం బిర్యానీ తిన్న తర్వాత రవికుమార్ బల్లిని గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే జీహెచ్‌ఎంసీ, చిక్కడపల్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి బిర్యానీలో బల్లి వచ్చిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. సగం తిన్న బిర్యానీ ప్లేట్లో చచ్చిపడి ఉన్న ఆ బల్లిని అలాగే వీడియో తీసిన కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన గడ్డం నవీన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు బావర్చి రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు. చనిపోయిన బల్లితో బిర్యానీ వడ్డించడంపై రవికుమార్ రెస్టారెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తినుబండారాలను అమ్మే ప్రాంతాలను సక్రమంగా తనిఖీలు చేయకపోవడంపై ఆయన పౌరసరఫరాల శాఖాధికారులను తప్పుబట్టారు. అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అన్నారు.
జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు జరిపిన దాడుల్లో బావర్చి రెస్టారెంట్‌లో ఆహారం తయారు చేసే సిబ్బంది, వడ్డించే సిబ్బంది చేతులకు గ్లోవ్స్ ధరించకుండా, తలకు హెయిర్ నెట్ ధరించకుండా, ముఖానికి మాస్కులు ధరించకుండానే తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. వంటగది పరిసరాలన్ని తడి, నూనె జిడ్డుతో మురికిగా ఉండటం గుర్తించారున అధికారులు. వంట తయారీకి అవసరమైన ముడి సరుకు అపరిశుభ్రంగా ఉన్న నేలపైనే పడేసి ఉండటం, స్టోరేజీ రూమ్ సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఇచ్చిన కస్టమర్ నుండి సేకరించిన చికెన్ బిర్యానీ శాంపిల్‌తో పాటు రెస్టారెంట్‌లోని చికెన్ బిర్యానీ శాంపిల్‌ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించినట్టు ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు మీడియాకు తెలిపారు. ఫుడ్ ల్యాబోరేటరీ నుంచి వచ్చే నివేదిక ప్రకారం బావర్చి రెస్టారెంట్‌పై తదుపరి చర్యలు ఉంటాయని, ప్రస్తుతం షోకాజ్ నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. బావర్చి రెస్టారెంట్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. GHMC చట్టం, 1955లోని 1973 నాటి ఈటింగ్ హౌస్‌లు లేదా హోటల్‌ల నియంత్రణ కోసం HMC బైలాస్ నిబంధనల ప్రకారం నాంపల్లిలోని రెస్టారెంట్ నిర్వహణకు వ్యతిరేకంగా మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.