సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-04-05 03:39 GMT

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పది లక్షల రూపాయల ఉచిత బీమా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు మరో శుభవార్త చెప్పింది. యాజమాన్యం చొరవతో సింగరేణిలో సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా పథకం వర్తింపజేస్తూ యూనియన్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది.

యూనియన్ బ్యాంకు ద్వారా...
ఈ నెల 1వ తేదీ నుంచి పథకం అమలు కానుంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచితంగా రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు


Tags:    

Similar News