రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో రేవంత్ రెడ్డి హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందనున్నారు. తనను వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.
వివిధ కార్యక్రమాలతో....
రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రచ్చబండ కార్యక్రమం పేరుతో ఆయన జనంలోకి వెళ్లారు. రేవంత్ రెడ్డి బయటకు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టం చేయడంతో కార్యకర్తల మధ్య ఆందోళనకు కూడా దిగారు. ఈక్రమంలోనే ఆయనకు కరోనా సోకిఉండవచ్చని భావిస్తున్నారు.