Covid Jn.1 cases in India : తెలంగాణలో పెరుగుతున్న వైరస్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు వైరస్ జిల్లాలకు కూడా వ్యాపించింది
corona in india
Covid cases in Telangana:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు వైరస్ జిల్లాలకు కూడా వ్యాపించింది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసులు పెరుగుతుండటంతో...
మహబూబ్ నగర్ జిల్లాలో రెండు కేసులు వెలుగు చూశాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలు రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ విధిగా ధరించాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.