తెలంగాణ పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరిగాయి. 24 గంటల్లో 280 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరిగాయి. 24 గంటల్లో 280 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను కఠిన తరం చేసింది.
మరణాల సంఖ్య....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,81,587 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,73,223 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,563 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,025 మరణించారు.