Congress : నేడు గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం
కాంగ్రెస్ రాజకీయ వ్యవహారా కమిటీ నేడు గాంధీభవన్ లో సమావేశం కానుంది. కీలక విషయాలపై చర్చించనుంది
abhishek manu singhvi, rajya sabha, congress, telangana
కాంగ్రెస్ రాజకీయ వ్యవహారా కమిటీ నేడు గాంధీభవన్ లో సమావేశం కానుంది. ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ లో జరగనున్న సమాేశానికి కీలక నేతలు హాజరు కానున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ థాక్రేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా ఈ సమావేశం కానుంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై...
దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులకు భర్తీపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్ కు వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.