రేవంత్ రెడ్డి క్లాస్ తో ఎమ్మెల్యేలు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీసుకున్న క్లాస్ తో నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాక్టివ్ అయ్యారు

Update: 2025-03-13 06:21 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాసనసభ పక్ష సమావేశంలో తీసుకున్న క్లాస్ తో నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాక్టివ్ అయ్యారు. నిన్న సీఎల్పీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని సూచించారు. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నా కాంగ్రెస్ సభ్యులు మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు. విప్ లు కూడా సరైన సమయంలో స్పందించాలని కోరారు.

ఈరోజు సభలో...
సభ్యులు పని విభజన చేసుకుని సభలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండేలా చూడాలని గట్టిగా కోరారు. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు యాక్టివ్ గా మారారు. బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్నవిమర్శలకు ఘాటు కౌంటర్లు ఇచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగులుతూ దళితవర్గానికి చెందిన స్పీకర్ ను అవమానించే విధంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలపాటు వాయిదా వేశారు.


Tags:    

Similar News