రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు

Update: 2025-08-04 03:46 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండాఆయనపై నేరుగానే విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

సోషల్ మీడియా ...
అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి మెసేజ్ పోస్ట్ చేసారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. . ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News