ఎస్ఐపై దాడికి దిగిన కాంగ్రెస్ నేత

ఖమ్మంలో కాంగ్రెస్ నేత ఒకరు ఎస్ఐ పై దురుసుగా ప్రవర్తించారు.

Update: 2025-06-07 02:45 GMT

ఖమ్మంలో కాంగ్రెస్ నేత ఒకరు ఎస్ఐ పై దురుసుగా ప్రవర్తించారు. కల్లూరులోని ఒక హోటల్ సిబ్బందికి, కాంగ్రెస్ వర్గీయులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న ఎస్ ఐ హరిత అక్కడ ఘర్షణను నివారించేందుకు వెళ్లారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాము, అతని అనుచరులు ఎస్ఐ హరితపై చేయి చేసుకున్నారు.

ఖమ్మం సమీపంలోని కల్లూరులో...
దీంతో వెంటనే కాంగ్రెస్ నేత రాముతో పాటు ఎస్ఐ హరితపై దాడికి యత్నించిన అతని అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ పట్ల దురుసుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, అతని అనుచరులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.


Tags:    

Similar News