Breaking : కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
ఉప ఎన్నికకు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ ను ప్రకటించింది.
abhishek manu singhvi, rajya sabha, congress, telangana
తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ ను ప్రకటించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2023 లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత విజయం సాధించారు.
మరణించడంతో...
అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మే 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె పోటీ చేసింది. కానీ ఈసారి శ్రీగణేష్ ను ఎంపిక చేసింది.