కరోనాతో మరణిస్తే రూ.50 వేల పరిహారం.. !

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి వారసులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం

Update: 2022-01-05 09:41 GMT

కరోనా కారణంగా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. వారి వారసులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి వారసులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కేంద్రం అన్నిరాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. గతేడాది నవంబర్ లోనే దరఖాస్తులకు ఆహ్వానించగా.. మొదటి విడతలో 3,870 దరఖాస్తులను డిసెంబర్ లో ఆమోదించి బాధిత కుటుంబాలకు పరిహారాన్ని అందజేసింది.

ఇంకా బాధితులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మీ సేవా కేంద్రం ద్వారా బాధితులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్, కరోనాతో మృతి చెందినట్లు ధృవీకరించే పత్రం, మృతుని ఆధార్ కార్డు వివరాలు దరఖాస్తులో చేర్చాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 040-48560012 నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.



Tags:    

Similar News