ప్రభుత్వాసుపత్రిలోనే సర్జరీ చేయించుకున్న కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Update: 2025-06-17 11:00 GMT

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్యులపై నమ్మకంతో చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించారు. ఆమెను అభినందించారు.

కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు విజయవంతంగా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

Tags:    

Similar News