తెలంగాణలో మంచు దుప్పటి

తెలంగాణలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. ఫిబ్రవరి మొదటి వారంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2022-02-05 04:10 GMT

తెలంగాణలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. ఫిబ్రవరి మొదటి వారంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బీహార్ నుంచి ఛత్తీస్ ఘడ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరింతగా.....
ఆదిలాబాద్ జిల్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోన అర్లిటిలో ఆరు డిగ్రీలు, బేలాలో 6.9 డిగ్రీలు, పొచ్చర్లలో 6.9 డిగ్రీగలు, కొమురం భీం జిల్లా కెరమెరిలో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, వికారాబాద్, నల్లగొండలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతుంది.


Tags:    

Similar News