విలీన వజ్రోత్సవాలు అధికారికంగా జరపండి

తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా చేపట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు

Update: 2022-09-03 07:39 GMT

తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. 17న తెలంగాణలో రాచరిక పాలన ముగిసిందన్నారు. ఆరోజు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, హోం మంత్రి వల్లభాయ్ పటేల్ లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారన్నారు. దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరిగినట్లే తెలంగాణలోనూ విలీన విజ్రోత్సవ వేడుకలను అధికారికంగా ఏడాది పాటు నిర్వహించాలని మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు.

అందరినీ గుర్తు చేసుకునేలా...
ఈ సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, అరుట్ల కమలమ్మ లను గౌరవించుకునేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు. నాటి త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తి నింపేలా కార్యక్రమాలను రూపొందించాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు.


Tags:    

Similar News