బీజేపీలో చేరనున్న చీకోటి ప్రవీణ్‌.. ఎప్పుడు అంటే..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తెలంగాణలో బీజేపీ..

Update: 2023-09-10 05:20 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దూకుడు పెంచాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్‌, బీజేపీలు కూడా తమతమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక అంటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తున్నాయి. తాజాగా చీకోటి ప్రవీణ్‌ బీజేపీ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 12వ తేదీన బీజేపీ తీర్థం పుచుకోనున్నారు చీకోటి ప్రవీణ్. తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీస్ లో పార్టీలో జాయిన్ కానున్నారు. అయితే చీకోటి ప్రవీణ్‌ చేరిక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో రానున్నారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్. ఇక రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చీకోటి ప్రవీణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌ లోని ఓ నియోజక వర్గం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల నేతలు దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలకు గాలం వేస్తున్నాయి. వారికి టికెట్లు, పదవుల ఆశ చూపి తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


Tags:    

Similar News