Telangana : రేవంత్ రెడ్డి సొంతూళ్లలో సర్పంచ్ ఏకగ్రీవం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయింది

Update: 2025-11-29 03:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయింది. కొండారెడ్డి పల్లె సర్పంచ్ ఏకగ్రీవానికి గ్రామ ప్రజలు అంగీకరించారు. ఎస్సీకి ఈ స్థానం రిజర్వ్ అయింది. అయితే ఈ పదవి కోసం మొత్తం పదిహేను మంది పోటీ పడ్డారు. పదిహేను మందిలో ఒకరిని గ్రామ ప్రజలు ఎంపిక చేయనున్నారు. సీల్డ్ కవర్ లో గ్రామ సర్పంచ్ పదవికి పేరును ప్రకటించనున్నారు.

సీల్డ్ కవర్ లో...
తెలంగాణలో నేడు నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో ముందుగానే గ్రామస్థులు కూర్చుని సర్పంచ్ పదవికి నామినేషన్లు పడకుండా పదవిని ఏకగ్రీవం చేస్తున్నట్లు గ్రామస్థులు నిర్ణయించారు. అయితే ఎవరిని సర్పంచ్ పదవికి ఎంపిక చేయాలన్న దానిపై తాము సీల్డ్ కవర్ లోనే తెలియజేస్తామని వారు చెబుతుండటం విశేషం.


Tags:    

Similar News