Revanth Reddy : నేడు పాశమైలారానికి ముఖ్యమంత్రి రేవంత్

పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు

Update: 2025-07-01 02:15 GMT

పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. 31 మంది కార్మికులు మరణించడంతో ఆయన ఈరోజు పాశమైలారం చేరుకుని కార్మికుల కుటుంబాలతో పాటు గాయాల పాలై చికిత్స పొందుతున్న వారితో కూడా మాట్లాడతారు. జరిగినఘటనను గురించి అడిగి తెలుసుకోనున్నారు.

అధికారులను అడిగి...
అలాగే అధికారులతో కూడా అక్కడే సమీక్ష నిర్వహిస్తారు. నిన్న జరిగిన ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలడమా? మరేదైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించనున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తుండటంతో వారికి ఎక్స్ గ్రేషియో కూడా ప్రకటించే అవకాశముంది. రేవంత్ రెడ్డి వస్తుండటంతో మృతుల కుటుంబ సభ్యులు తప్ప అక్కడ వేరే వారిని అనుమతించడం లేదు.


Tags:    

Similar News