ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాం : రేవంత్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2025-02-04 13:07 GMT

ఎస్సీ వర్గీకరణ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంచారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే తాను అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణ చేయాలని ఎస్సీ కమిషన్ తెలిపిందన్నారు. మూడు వర్గాలుగా విభజించిందని తెలిపింది.

ఎన్నో ఉద్యమాలు జరిగాయని...
ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్న రేవంత్ రెడ్డి ఈరోజు సభలో ప్రవేశపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన జీవితంలో ఈరోజు పేజీ ఒక ప్రత్యేకమైనదని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎల్లకాలం గుర్తుండిపోయే అంశాలు నేడు సభలో ప్రవేశపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. దళిత సమాజం పట్ల తమ ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుందని తెలిపారు. ఇది ఒకచారిత్రక మైన రోజు అని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ విధానమన్నారు.


Tags:    

Similar News