Revanth Reddy : మంత్రులతో రేవంత్ రెడ్డి సమీక్ష
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం మొదలయింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చిస్తున్నారు.
నివేదికలతో మంత్రులు
ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులపై నివేదిక అందించారు. గత నెల 29, 30న జిల్లాల్లో పర్యటించిన మంత్రులుఅవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూసదస్సులపై..జిల్లాల వారీగా సీఎంకు నివేదికలు మంత్రులు ఇచ్చారు. రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాల్సిన నిర్ణయాలపై కూడా మంత్రులతో చర్చించారు.