Revanth Reddy : కంచె గచ్చిబౌలి భూములపై రేవంత్ సంచలన కామెంట్స్
కంచె గచ్చిబౌలి భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
కంచె గచ్చిబౌలి భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించారని, కానీ అది తాత్కాలికమేనని అన్నారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూములు 2003లో కొందరు ప్రయివేటు వ్యక్తులకు కేటాయించారని, అయితే అది యూనివర్సిటీ భూములు కావని, ప్రభుత్వానివేనని అన్నారు.
అక్కడ ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేస్తాం...
భవిష్యత్ లో వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నంత మాత్రాన అది తాత్కాలికమేనని అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గిందని అనుకోవద్దని అన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదారాబాద్ నగరాన్నిన్యూయార్క్, టోక్యో, సింగపూర్ తో పోటీ పడేలా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.