సిగాచీ పరిశ్రమ మృతులకు తక్షణ సాయాన్ని ప్రకటించిన రేవంత్
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడిన వారికి యాభైవేల రూపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇది పరిహారం కాదని, తక్షణ సాయం మాత్రమేనని రేవంత్ రెడ్డి అధికారులతో చెప్ారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రమదాలకు గల కారణాలను...
సిగాచీ పరిశ్రమ అనుమతులు, బోర్డు సభ్యులపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తనిఖీలు చేశారా? పూర్తి స్థాయి నివేదికను తనకు సమర్పించాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను నియమించి నివేదిక రూపొందించాలని అన్నారు. ఊహాగానాలతో నివేదికలు వద్దని, పక్కాగా ఏం జరిగిందన్నదానిపైనే తనకు నివేదిక కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సైవలు అందించాలని, అందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.