పటాన్ చెర్వు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ ఆరా
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది గాయపడ్డారని ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
మెరుగైన వైద్యాన్ని...
పటాన్ చెర్వులో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గాయపడిన కార్మికులను వెంటనే మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రికి అయినా తరలించి వారి ప్రాణాలను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ప్రమాదంపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను కూడా సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.