Revanth Reddy : ఓ బికారీ.. అవును నేను మేస్త్నీనే.. కేటీఆర్‌కు రేవంత్ ఘాటు రిప్లై

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు

Update: 2024-01-25 12:15 GMT

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీని ఓడించి రాహుల్ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ యువతను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన అన్నారు.

ఛార్లెస్ శోభరాజ్ ఎక్కడ?
కార్యకర్తల కష్టం వల్లనే తామంతా ఈ స్థాయిలో ఉన్నామన్నారు. వారి చెమటోడ్చడం వల్లనే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తలను తమ రక్తాన్ని చెమటగా మార్చి పార్టీ విజయానికి కృషి చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే తరహాలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను వచ్చేలా పనిచేయాలన్నారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. వారంలో మూడు రోజులు జల్లాలో పర్యటిస్తానని, మొన్నటి ఎన్నికల్లో ఓడించామని, రానున్న ఎన్నికల్లో సరిహద్దులు దాటిస్తామని అన్నారు. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతున్నారని, ఛార్లెస్ శోభరాజ్ దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకుని ఉన్నాడని ఎద్దేవా చేశారు.
గోరీ కట్టడం ఖాయం...
కార్యకర్తల కష్టం ఫలితంగానే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని అప్పుడే గోల చేస్తున్నారని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులు కూడా కాలేదన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. మరో రెండు పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దద్దమ్మల్లారా.. ఉద్యోగాలకు జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితిని తెచ్చారన్నారు. రైతు బంధు పథకాన్ని ఇచ్చామన్నారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి అందరికీ రైతు భరోసా నిధులు అందరికీ అందేలా చూడాలన్నారు. అవును బికారీ... నేను మేస్త్రీనేనని అన్నారు. విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని రేవంత్ రెడ్డి అన్నారు. మీకు గోరి కట్టడం ఖాయమని ఆయన అన్నారు. ఎవర్ని నువ్వు రాజ్యసభ సభ్యులను చేశావని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.


Tags:    

Similar News