Revanth Reddy : రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన పరిధిలో రేవంత్ రెడ్డి పై గతంలో కేసు నమోదయింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారంటూ పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2016లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.
సాక్ష్యాధారాలను...
ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. గత నెల 20వ తేదీన ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు తీర్పు చెప్పింది. అయితే ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి లేడని దర్యాప్తులో తేలిందని, ఫిర్యాదుదారు ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది.